99 రూపాయలు కట్టండి, సంవత్సరం వరకు ఉచిత కాల్స్ చేసుకోండి.


అన్ని మొబైల్ నెట్ వర్కులకు పట్టపగలే చుక్కలు చూపించిన జియో ఆఫర్ల పర్వం మార్చి నెలతో ముగియనుంది. మొదలుపెట్టిన 170 రోజులలోనే తమ ఉచిత ఆఫర్లతో 10 కోట్ల మంది సబ్ స్క్రైబర్స్ ని సొంతం చేసుకున్న జియో ఏప్రిల్ 1 నుండి వారి నుండి తిరిగి డబ్బులు వసూలు చేసేందుకు రెడీ అయ్యింది. భారతదేశంలో అతి తక్కువ సమయంలోనే 10 కోట్ల మంది కస్టమర్లను సాధించినందుకు గర్వం గా ఉందని ప్రకటించిన ముఖేష్ అంబానీ, ఏప్రిల్ 1 నుండి జియో ప్రైమ్ మెంబర్ షిప్ అనే ప్రత్యేక ప్లాన్‌ మొదలు పెడుతున్నట్లు ప్రకటించారు. అందులో సభ్యత్వం పొందాలంటే మార్చి 1 నుండి 31 లోపు 99 రూపాయలు కట్టవలసి ఉంటుంది. ఆ ప్లాన్‌ వలన ఉపయోగాలు క్రింద చదవండి.

ముందుగా మార్చి 31 లోపు రూ.99 చెల్లించి జియో ప్రైమ్‌ ప్రత్యేక ప్లాన్‌ లో సభ్యత్వం తీసుకుంటే ఏప్రిల్ 1 నుండి సంవత్సరం వరకు అన్ని వాయిస్ కాల్స్ ఫ్రీ మరియు రోమింగ్ ఛార్జీలు ఉండ‌వు. దీనితో పాటు ప్రతీ నెల 303 రూపాయలతో రీచార్జ్ చేయించుకుంటే సంవత్సరం వరకు ఉచిత డేటా కూడా పొందవచ్చు. ఇవే కాకుండా ఇంకా చాలా ఇతర టారిఫ్ లు అందుబాటులో ఉంటాయని, ప్రతి టారిఫ్ రేటు ప్రకారం ఇత‌ర టెలికాం కంపెనీలు అందిస్తున్న డేటా క‌న్నా జియో 20 శాతం అద‌నంగా డేటాను ఇస్తుందని ప్రకటించారు ముఖేష్. మరి ఎంత మంది డబ్బులు కట్టి జియో సర్వీసును వాడతారో తెలియాలంటే ఏప్రిల్ వరకు ఆగాల్సిందే.


0 comments:

http://go.ad2up.com/afu.php?id=1017948